నెల్లూరులో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య…
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూలాపేటలోని పోలీసు క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు భార్య పూర్ణిమ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న చిన్నబజారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.