Clock Of Nellore ( Nellore ) – వేగంగా మారుతున్న ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో హై బ్లడ్ ప్రెజర్ (బీపీ), డయాబెటిస్ (షుగర్) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 30 నుండి 40 ఏళ్ల మధ్య వయస్కులలో ఈ వ్యాధులు కనిపించడం ఆందోళనకరమని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె. పెంచిల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రుగ్మతలపై ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అధిక ఉప్పు, నూనె, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి బీపీ పెరుగుతుందని, అలాగే శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు పెరగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించలేక డయాబెటిస్‌కు దారి తీస్తుందని దానికి దీర్ఘకాలిక ఒత్తిడి కూడా ఈ రెండు వ్యాధులకు ప్రధాన కారణమని డాక్టర్ పెంచిల ప్రసాద్ పేర్కొన్నారు. బీపీ, షుగర్ మొదట్లో పెద్దగా లక్షణాలు చూపవు. కానీ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతాయని ఆయన హెచ్చరించారు.
దీనిపై ఆయన పలు సూచనలు చేశారు. “ప్రస్తుత జీవనశైలి మార్పులు బీపీ, డయాబెటిస్‌కు ప్రధాన కారణం. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, సరైన నిద్ర అలవాటు చేసుకుంటే ఈ వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం ఒకసారి బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి,” అని అన్నారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అతి తక్కువ ఫీజులతోనే బీపి, షుగర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిని అదుపులో ఉంచుకునే విధంగా జీవన శైలి ఇతర అంశాలపై రోగులకు అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ పెంచిల ప్రసాద్ వెల్లడించారు. బీపి, షుగర్ కారణంగా తలెత్తే అన్నీ వ్యాధులకు మెడికవర్ లో అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. మెడికవర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
