శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్పీ విజయరావు హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో ఎక్కడైనా, ఎవ్వరైనా శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ విజయరావు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని, రౌడీ షీటర్లు తమ నేర జీవితానికి ముగింపు పలకాలని లేదంటే పోలీస్ అంటే ఏంటో చూస్తారని హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించాలన్న ఆలోచన కూడా రాకూడదని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, అవసరమున్న ప్రాంతాల్లో సిసి కెమరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేరాలకు పాల్పడి విలువైన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దని రౌడీ షీటర్లకు హితవు పలికారు, ఎక్కడ అల్లర్లు, గొడవలు జరిగినా, అనుమానితులు తిరుగుతున్నా డయర్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజయరావు ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Previous

కామాక్షితాయి సేవలో ఎంపి విజయసాయి రెడ్డి కుటుంబం

Read Next

కార్తీక మహా దీపోత్సవ వేడుకలు : ఉదయం పూజలు నిర్వహించిన ప్రముఖులు

Leave a Reply

Your email address will not be published.