మరికొద్ది సేపట్లో పెళ్లి… లవర్ ఎంటర్ కావడంతో పరారయిన వరుడు

Clock Of Nellore ( Nellore ) – ప్రియురాలికి మస్కా కొట్టి మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమైన ఓ యువకుడి నిర్వాకం నెల్లూరులో వెలుగుచూసింది. నగరంలోని ఫత్తేఖాన్ పేటకు చెందిన అభిషేక్ అనే యువకుడు ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కీర్తి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. గత కొన్ని నెలలుగా వీరి ప్రేమ వ్యవహారం సాగుతుంది. ప్రియుడి నిర్వాకానికి కీర్తి గర్భవతి అయినట్లుగా కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా కీర్తికి దూరంగా ఉన్న అభిషేక్ గురువారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ చర్చ్ లో బంధువుల యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న కీర్తి చర్చ్ వద్దకు చేరుకుని అభిషేక్ ను ప్రశ్నించగా అతను అక్కడి నుండి జారుకున్నాడు. కొద్ది సేపటికి బంధువులు కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో కీర్తి చిన్నబజారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Previous

అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి

Read Next

ఈనెల 24న టిడిపిలోకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి : చంద్రబాబు సమక్షంలో చేరిక

Leave a Reply

Your email address will not be published.