Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో భారీ చోరీ జరిగింది. న్యూ మిలటరీ కాలనీలో నివాసం ఉండే సిహెచ్. ప్రసన్నకుమార్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నివాసంలో ఈ చోరీ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కాంట్రాక్ట్ పనులపై ప్రసన్న కుమార్ రెడ్డి చెన్నైలో ఉన్నారు. వారి నివాసంలో ఆయన తండ్రి, కుమార్తె ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వారి నివాసంలోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న ఇద్దర్నీ నిర్భందించిన చంపేస్తామంటూ కత్తులతో బెదిరించారు. ఇంట్లో ఉన్న 10 సవర్ల బంగారు ఆభరణాలు, 55వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ కూడా పరిశీలించింది. నిందితులను గుర్తించే ప్రక్రియ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
