టిడిపిలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు

Clock Of Nellore ( Mangalagiri ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు, వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. గిరిధర్ రెడ్డి ఇవాళ ఉదయం రెండు వేల మంది కార్యకర్తలతో నెల్లూరు నుండి మంగళగిరికి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చంద్రబాబు… కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటూ వైసీపి నెల్లూరు నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, నెల్లూరు నగర మేయర్ స్రవంతి భర్త పోట్లూరి జయవర్ధన్, 19వ డివిజన్ కార్పొరేటర్ భర్త మదన్ కుమార్ రెడ్డి, 30వ డివిజన్ కార్పొరేటర్ భర్త కరణం హజరత్ నాయుడు, చక్రవర్ధన్ రెడ్డి, శోభారాణి తదితరులు చంద్రబాబు చేతుల మీదుగా పసుపు కండువాలు వేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు బీదా రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కన్నబాబు, వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపిలో ఎంతో నమ్మకస్తుడైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఆ పార్టీలో కొనసాగలేకున్నారంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాలన్నారు. నమ్ముకున్న వారిని నట్టేటా ముంచే సైకో జగన్ అని విమర్శించారు. అన్నీ వర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని దాని ఫలితమే పట్టభద్రుల స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనమని అన్నారు. ఇది గాలేనని రాబోయేది తుఫాను అని అంటూ రానున్న ఎన్నికల్లో వైసీపి పూర్తిగా కొట్టుకుపోతుందని అన్నారు.

 

Read Previous

డాక్టర్ విజయకుమార్ హత్య కేసు తీర్పు : భార్యా, కుమారుడు, మరో ముగ్గురికి జీవితఖైదు

Read Next

నలుగురు వైసీపి ఎమ్మెల్యేల సస్పెండ్ : ముగ్గురు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు

2 Comments

  • Very very good decision. All the best

  • Very very good decision. All the. best A .S.Peta

Leave a Reply

Your email address will not be published.