
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూలాపేటలోని పోలీసు క్వార్టర్స్ లో ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు భార్య పూర్ణిమ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న చిన్నబజారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త నాగరాజు వేధింపుల కారణంగానే పూర్ణిమ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. వీరికి పెళ్లై ఇంకా ఏడాది కూడా కాలేదని మృతురాలి కుటుంబసభ్యులు విలపించారు. మరో వైపు నాగరాజుకు ఇది రెండో వివాహమని, మొదటి భార్య కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.