
Clock Of Nellore ( Kota ) – నెల్లూరుజిల్లా కోట మండలం ఊనుగుంట వద్ద ప్రమాదం జరిగింది. చిల్లకూరు మండలం, అన్నంబాక గ్రామానికి చెందిన కసుమూరు కోటయ్య అనే వ్యక్తి బైక్ పై కోట నుండి స్వగ్రామానికి వెళ్తుండగా కోట సమీపంలోని ఊనుగుంట పాళెం వద్ద వెనుకవైపు నుండి లారీ వేగంగా వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న కోటయ్య మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోట ఎస్సై పుల్లారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలిసింది.
One Comment
Back nunchi khadu.aduruga vastunna two wheeler