Clock Of Nellore ( Kovur ) – కోవూరులో దారుణ హత్య జరిగింది. లేగుంటపాడు జెండావీధికి చెందిన సయ్యద్ సంధానీ బాషాకు, అదే ప్రాంతానికి చెందిన షఫీ అనే ఇద్దరికీ పాత గొడవలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏమైందో ఏమో ఇవాళ మద్యం సేవించి వచ్చిన షఫీ… సంధానీ బాషాతో గొడవ పడ్డాడు. గొడవ కాస్తా ఘర్షణగా మారడంతో షఫీ ఇనుప రాడ్డుతో సంధానీ బాషా తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సంధానీ బాషా అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంధానీ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు హత్య చేసిన షఫీ పోలీసులకు లొంగిపోయాడు.
