Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నవాబుపేటలోని రవీంద్ర భారతి స్కూల్లో 4వ తరగతి చదివే ఓ విద్యార్ధిపై టీచర్ కర్కశంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్ధి కన్నుపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్త స్రావమైంది. తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా కన్నుకు ప్రమాదమేనని చెప్పడంతో ఆమె భోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన ఆషా అనే మహిళ కుమారుడు ఆకాంక్ష్ స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 8వ తేదీనా మధ్యాహ్నం ఆకాంక్ష్ క్లాస్ రూంలో ఉండగా బాలుడ్ని మందలించే క్రమంలో లేడీ టీచర్ బెత్తంతో కొట్టింది. బెత్తం ఆకాంక్ష్ ఎడమ కన్నుకు తగిలింది. తీవ్ర రక్త స్రావం అయినా ఆ లేడీ టీచర్ పట్టించుకోలేదు. సాయంత్రం ఆకాంక్ష్ తల్లి స్కూల్ కు వచ్చి బాలుడ్ని ఇంటికి తీసుకెళ్లింది. ఇంటి కెళ్లి గమనించగా కంటి నుండి రక్తం కారుతుంది. తల్లి ప్రశ్నించడంతో బాలుడు అసలు విషయం తెలిపాడు. వెంటనే ఆమె కంటి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కంట్లో రక్తం గడ్డ కట్టి ఉందని, కంటిలో ఓ పొర తొలగిపోయిందని చెప్పినట్లు బాలుడి తల్లి ఆషా తెలియజేసింది. భవిష్యత్తులో కంటి చూపుకు ఇబ్బంది అని కూడా వైద్యులు చెప్పినట్లు ఆషా వెల్లడించింది. మనస్థాపానికి గురైన ఆషా రవీంద్ర భారతి స్కూల్ పై నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుమారుడు ఆకాంక్ష్ ను పట్టుకుని ఆషా బోరున విలపిస్తున్న దృశ్యాలు కన్నీరు తెప్పించాయి.
3 Comments
That is not correct… And journlists also very interest on that type of things… Try to know really what happend and really there is serious situvation, if really happend no body cant support.. But only viewing rating and sensational purpose that is not good… Alreday so many news articles are not relaible…
This teacher panish
ఇలా కంటి మీద బెత్తం తో కొట్టిన టీచర్ ని జాబ్ లో నుంచి పూర్తిగా తీసి వేయాలి ఉర్దగ టీచర్లు కి మంత్లీ 50.60 వేలు జీతాలు ఏం చేస్తున్నారు ఈ టీచర్లు స్కూల్ లో సెల్ ఫోన్లు లో మాట్లాడుకోవడం సరి పోతున్నది