ప్రసన్న గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యాఖ్య

Clock Of Nellore ( Kovur ) – దోచుకోవడం, దాచుకోవడమే పనిగా గత ఐదేళ్లు పాలించిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలను నిలుపుకోలేని అసమర్ధ నాయకుడు ప్రసన్న అని మండిపడ్డారు. మాజీ మంత్రినని చెప్పుకునే ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరి ప్రభుత్వంలో మంత్రి అయ్యారో ప్రజలకు చెప్పాలని ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ప్రశాంతి రెడ్డి కోవూరులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా కోవూరు మండలం, పడుగుపాడులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 5లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రోడ్డును ప్రారంభించారు. తర్వాత కోవూరులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న రోగులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ లేదన్న విషయం తెలుసుకున్న ప్రశాంతి రెడ్డి… విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీజర్లు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని, డాక్టర్ నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం వైద్యులతో సమీక్ష నిర్వహించారు.

సమీక్ష అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. బుచ్చి మున్సిపాల్టీ వైస్ ఛైర్మైన్ల ఎన్నికల్లో వైసీపి కౌన్సిలర్లను ప్రలోభపెట్టి, టిడిపికి అనుకూలంగా ఓటు వేయించుకున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశ్యంతోనే వారు టిడిపికి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. స్వంత పార్టీ నేతలను నిలుపుకోలేని ఆయనా ఓ నాయకుడేనా అని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్లు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రినని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరి ప్రభుత్వంలో మంత్రి అయ్యారో కూడా చెప్పాలన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే టార్గెట్ గా ఐదేళ్లు పాలించిన ప్రసన్న ఎప్పుడైనా సామాన్యుల కోసం పనిచేశారా అని ఆగ్రహించారు. ప్రసన్న గురించి మాట్లాడటమే వేస్ట్ అని మీడియా కూడా ఆయన్ను లైట్ గా తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి అన్నారు.

Read Previous

మంత్రి ఆనంతో కలెక్టర్ భేటీ : జిల్లా అభివృద్ధిపై చర్చ

Read Next

MP మాగుంటకు అస్వస్థత : అపోలో హాస్పిటల్ లో గుండె బైపాస్ సర్జరీ

Leave a Reply

Your email address will not be published.