మంత్రి ఆనంతో కలెక్టర్ భేటీ : జిల్లా అభివృద్ధిపై చర్చ

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్‌ ఆనంద్‌తో మంత్రి ఆనం పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి కలెక్టర్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేయాలని కోరారు. జిల్లాలో పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్‌ పనులు, సోమశిల ప్రాజెక్టు సంబంధిత పనులు, ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా విద్యారంగంలో రానున్న నూతన విధానాలపై చర్చించారు.

Read Previous

అమ్మవారి అలంకరణతో తల్లి మొక్కు తీర్చిన తనయుడు

Read Next

ప్రసన్న గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యాఖ్య

Leave a Reply

Your email address will not be published.