Clock Of Nellore ( Kuwait ) – ప్రవాసాంధ్రుల రక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపి నాన్ రెసిరెన్స్ తెలుగు సొసైటీ సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తోంది. సమస్యలతో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. తాజాగా కువైట్ లో ఉండే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బుడితి శ్రీనివాస్ అనే వ్యక్తిని స్వస్థలానికి చేర్చింది. వివరాల్లో కెళ్తే… పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన బుడితి శ్రీనివాస్ ఆయన భార్య అరుణ ఇద్దరూ 18 ఏళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం కువైట్ కు వెళ్లారు. రోజు వారీ కూలీ పనులు చేసుకుంటున్న శ్రీనివాస్ కు గతేడాది జూన్ లో ప్రమాదం జరిగింది. నడుముకు కాళ్లకు బలమైన గాయాలు తగలడంతో హాస్పిటల్ లో మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తాము ఇండియాకు వెళ్లిపోతామని సహాయం చేయాలని APNRTS ను సంప్రదించారు. ఏపి ప్రభుత్వం తరపున కువైట్ లో ఉన్న APNRTS కో – ఆర్డినేటర్ నాయని మహేశ్వర రెడ్డి… శ్రీనివాస్ ఉన్న హాస్పిటల్ కు వెళ్లి వారు ఇండియాకు వచ్చేందుకు ప్రభుత్వం తరపున భారత రాయబార అధికారులతో కలిసి ఏర్పాట్లు చేశారు. వారే హాస్పిటల్ బిల్లులు చెల్లించి, ఇండియాకు విమాన ప్రయాణానికి టిక్కెట్లు ఏర్పాటు చేసి ఇద్దర్నీ ఇండియాకు పంపారు. శుక్రవారం వారు విమానంలో హైదరాబాద్ కు చేరుకోగా అక్కడి నుండి స్వస్థలానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ వారు స్వస్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ భార్య అరుణ మాట్లాడుతూ తాము ఇండియాకు వచ్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్ కు, సిఈఓ దినేష్ కుమార్ కు, APNRTS డైరెక్టర్ బి. హెచ్. ఇలియాజ్ కు, వైసీపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసినట్లు వైసీపి గల్ఫ్ మీడియా కో- ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా తెలియజేశారు.
One Comment
Very interesting information!Perfect just what I was looking for!