Clock Of Nellore ( Buchi ) – నెల్లూరుజిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ కమిషనర్ గా ఇనమాల చిన్నబాబు నియమితులైనారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్భన్ డెవలప్ మెంట్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల నేపద్యంలో సోమవారం సాయంత్రం బుచ్చిలోని మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్న చిన్నబాబు… కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనర్ చిన్నబాబు… ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఛైర్ పర్సన్ సుప్రజ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు.
నెల్లూరు నగర పాలక సంస్థలో ఓ సాధారణ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన ఇనమాల చిన్నబాబు అకుంఠిత దీక్షతో, తన దైన శైలిలో విధులు నిర్వహించి సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటరీకణ మొదలైన కాలంలో చిన్నబాబు నెల్లూరు మున్సిపాల్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కంప్యూటర్ యుగం మొదలయ్యి నెల్లూరుకు పరిచయమైన రోజుల్లోనే చిన్నబాబు కంప్యూటర్ పై పట్టుపెంచుకున్నారు. నెల్లూరు మున్సిపాల్టీ ఫైళ్లను కంప్యూటరైజ్ఢ్ చేయడంలో చిన్నబాబు తనదైన పాత్రను పోషించారు. తర్వాత నెల్లూరు కార్పొరేషన్ లో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టి పన్ను వసూళ్లలో రికార్డు సృష్ఠించారు. లెక్కలేనన్ని దఫాలు అనేక అవార్డులు అందుకున్నారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఈ ఏడాది జనవరిలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానింగ్ విభాగానికి సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం తాజాగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీకి కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.