MP మాగుంటకు అస్వస్థత : అపోలో హాస్పిటల్ లో గుండె బైపాస్ సర్జరీ

Clock Of Nellore ( Chennai ) – ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతకు గురైనారు. నిన్న చెన్నైలోని వారి నివాసంలో ఉండగా ఛాతి నొప్పి రాగా వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక పరీక్షలతో పాటూ యాంజియోగ్రామ్ పరీక్షలను నిర్వహించగా గుండెకు రక్తం సరఫరా అయ్యే కవాటాల్లో బ్లాకులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని సిఫార్సు చేశారు. గురువారం వైద్యులు బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, ప్రమాదం ఏమీ లేనట్లుగా వైద్యులు పేర్కొన్నారు. త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.

Read Previous

ప్రసన్న గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యాఖ్య

Read Next

అందుకే టెంకాలయ బ్యాచ్ కు టెంకె పగలగొట్టారు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.