సముద్రుడికి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్

Clock Of Nellore ( Gudluru ) – రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా నెల్లూరుజిల్లా గుడ్లూరు మండలం, మొండివారిపాళెం సముద్ర తీరానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా సముద్రుడికి పూజ నిర్వహించారు. వేద పండితులు సిఎంను సముద్రం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య సముద్రుడికి పట్టుబట్టలు సమర్పించారు. పూజ కూడా నిర్వహించారు. శంఖుస్థాపన ఇటుకను సముద్రంలో వదిలారు. తర్వాత భూమి పూజ నిర్వహించారు. అనంతరం రామాయపట్నం పోర్టు శంఖుస్థాపనకు సంభందించిన శిలా ఫలకం వద్దకు చేరుకుని దాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శిలా ఫలకం ఆవిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోర్టు అభివృద్ధిని తెలిపే ఫోటో గ్యాలరీని సిఎం సందర్శించారు.

Read Previous

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు – తర్వాత వీడ్కోలు

Read Next

రామాయపట్నంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిఎం సైకత శిల్పం

Leave a Reply

Your email address will not be published.