ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు – తర్వాత వీడ్కోలు

Clock Of Nellore ( Gudluru ) – రామాయపట్నం పోర్టు శంఖుస్థాపన కోసం నెల్లూరుజిల్లాలోని రామాయపట్నంకు ప్రత్యేక హెలికాప్టర్ లో విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు – ప్రకాశం జిల్లాల జడ్పీ ఛైర్ పర్సన్లు ఆనం అరుణమ్మ, బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, తూమాటి మాధవ రావు, కోవూరు, కందుకూరు, కావలి, నెల్లూరు సిటీ, ఉదయగిరి, ఆత్మకూరు, కనిగిరి ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ విజయరావు, రామాయపట్నం పోర్టు అథారిటీ ఎండి ప్రతాప్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరసింహారావు తదితరులు సిఎంకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం కూడా వీరు సిఎంకు వీరు వీడ్కోలు పలికారు.

Read Previous

సమస్యలు ఉంటే తెలియజేయండి : గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

సముద్రుడికి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్

Leave a Reply

Your email address will not be published.