చోరీకి యత్నించిన దొంగ… అనుమానాస్పద మృతి… ఏం జరిగిందంటే..?

Clock Of Nellore ( Gudur ) – తిరుపతి జిల్లా, గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో చోరీకి వచ్చిన దొంగ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గూడూరులో అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ చేసేందుకు దొంగ యత్నించాడు. చోరీని అడ్డుకున్న ఇంటి యజమానులపై కర్రతో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన వారు అతనిని పట్టుకుని కొట్టి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతి చెందాడు. మృతి చెందిన దొంగ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ఆనంతో భేటీ అయిన జిల్లా వైద్యఆరోగ్య అధికారి పెంచలయ్య…

Read Next

4 రాజ్యసభ స్థానాలకు 5 మంది పోటీ… బీదా మస్తాన్ రావుకు గ్రీన్ సిగ్నల్ ?

Leave a Reply

Your email address will not be published.