రూరల్ అభివృద్ధి పనుల జాతర : దామచర్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ మనుమసిద్ది నగర్‌, 37, 38, 41 డివిజన్లలో సుమారు రూ. 1 కోటి 95 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఏపి మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య నారాయణ, మేయర్ దేవరకొండ సుజాత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇతర ముఖ్య నేతల సమక్షంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 650 కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తి కాగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయని తెలిపారు. “ప్రజల కోసం నిరంతరం శ్రమించే వారికే టీడీపీలో గుర్తింపు ఉంటుంది. అతి సామాన్యులకు సైతం చంద్రబాబు, లోకేశ్‌లు ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.

ఏపి మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల్లో రూ. 650 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఒక్క శ్రీధర్ రెడ్డికే సాధ్యమైందని కొనియాడారు. రూరల్ అభివృద్ధిలో కోటంరెడ్డి సోదరులిద్దరూ ఎమ్మెల్యేలుగా శ్రమిస్తున్నారని, వారి పనితీరు అందరికీ ఆదర్శమని ప్రశంసించారు. రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసిన్, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జులు, డివిజన్ అధ్యక్షులు మరియు అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Previous

ఇంత దిగజారుడు రాజకీయమా… జగన్ పై ఎమ్మెల్సీ బీద మండిపాటు

Read Next

ఒక్క రోజు శిశువుకు అపోలో హాస్పిటల్ లో అరుదైన మెదడు శస్త్ర చికిత్స విజయవంతం

Leave a Reply

Your email address will not be published.