
Clock Of Nellore ( Chillakuru ) – తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని కడివేడులో అమానుషం జరిగింది. దొంగతనం నెపంతో ఓ గిరిజన బాలుడిపై ఓ వ్యక్తి పాశవికంగా ప్రవర్తించిన సంఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. గిరిజన బాలుడు మేకలు తోలుకుని వెళ్తుండగా సమీపంలోని తోట యజమాని ఆ బాలుణ్ని ఆపి కోడి నువ్వేకదా దొంగిలించింది అని బెదిరించాడు. తనకేమీ తెలియదని చెప్పగా ఆగ్రహంతో ఊగిపోతూ బాలుడ్ని కొట్టాడు. అంతే కాకుండా మండుటెండలో ఆ బాలుణ్ని విద్యుత్ స్థంబానికి కట్టేశాడు. ఈ విషయాన్ని సమీపంలోని కొందరు గమనించి బాలుడ్ని విడిచిపెట్టాలని కోరినా అతను అంగీకరించలేదు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అక్కడికొచ్చి ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. ఎలాగోలా బాలుణ్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. గిరిజన బాలుణ్ని స్థంబానికి కట్టేసి కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్ట్ చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.