తిరుపతి జిల్లా వైసీపి ఆత్మీయ సమావేశం… హాజరైన ఉమ్మడి నెల్లూరుజిల్లా నేతలు

Clock Of Nellore ( Tirupathi ) – తిరుపతిలోని ఓ హోటల్ లో నూతనంగా ఏర్పాటైన తిరుపతి జిల్లా వైసీపి ఆత్మీయ సమావేశం ( Tirupathi District ) జరిగింది. తిరుపతిజిల్లా వైసీపి అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పూర్వపు చిత్తూరు జిల్లాలోని నేతలు, తిరుపతిజిల్లాలో కలిసిన పూర్వపు నెల్లూరుజిల్లాలోని నియోజకవర్గాల నేతలు హాజరైనారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ, తిరుపతి ఎమ్పీ గురుమూర్తి తదితరులు హాజరయ్యారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అందరూ సత్కరించారు. నూతన జిల్లాను అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని ప్రసంగించారు.

 

Read Previous

ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి : బిజేవైఎం నేత యశ్వంత్ సింగ్ అరెస్ట్

Read Next

దొంగతనం నెపంతో గిరిజన బాలుడిపై దాడి… చిల్లకూరులో అమానుషం

Leave a Reply

Your email address will not be published.