Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఛైర్మైన్ గా వేమిరెడ్డి సురేంధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు.
నరసింహకొండ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఒప్పించి 50 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. 50 కోట్లు నిధులు మంజూరైతే జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా నరసింహకొండ మారిపోతుందని అన్నారు. నెల్లూరు రూరల్ లో అభివృద్దే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారిలోని బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్ల వద్ద ఫ్లై ఓవర్ వంతెనలు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆథ్యాత్మిక భావన కలిగిన నాయకులు, కార్యకర్తలకు వివిధ ఆలయ పాలక మండళ్లలో స్థానం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దాత అల్తూరు సులోచనమ్మ, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, వైసీపి నెల్లూరు నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, నెల్లూరు ఏఎంసి ఛైర్మైన్ ఏసు నాయుడు, వైసీపి నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

