Clock Of Nellore ( Dakkili & Venkatagiri ) – నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంతో పాటూ నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతులు రారాజులుగా జీవిస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి అన్నారు. వైసీపి ప్రభుత్వం రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని డక్కిలిలో వ్యవసాయ యంత్రాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. డక్కిలిలోని సచివాలయం వద్ద వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనం పాల్గొని ప్రభుత్వ సబ్సిడీతో మంజూరు చేసిన వరికోత యంత్రాలు, ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం ఆనం మాట్లాడుతూ వ్యవసాయం, రైతుల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్నీ విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. అనంతరం వెంకటగిరిలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఆనం రామ నారాయణరెడ్డి … తర్వాత వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జాతీయ చేనేత అభివృద్ది పథకం ద్వారా లబ్ధిదారులకు మంజూరైన మోటో రైజ్ డ్ లిఫ్టింగ్ మిషన్లను పంపిణీ చేశారు.

