Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని వారి నివాసంలో ఉంచిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం నుండి వేలాది సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయన్ను కడసారిగా చూపు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు మేకపాటి నివాసానికి వచ్చి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి అంజలి ఘటిస్తున్నారు. అన్నీ రాజకీయపార్టీల నేతలు తరలి వచ్చారు.
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ డిసిసిబి ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి తదితరులు గౌతమ్ రెడ్డికి నివాళి అర్పించారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ, సిపిఐ నేత వి. రామరాజు, జనసేన పార్టీ నేతలు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మంత్రి తానేటి వనిత, హోం మంత్రి మేకతోటి సుచరిత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె ఆనం కైవల్య, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్ – పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయకుమార్, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని దర్శించి నివాళి అర్పించారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
శ్రీ సిటీ ఎండి రవిసన్నారెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, ఆ పార్టీ నేతలు చండ్ర రాజగోపాల్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాసు వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మాజీ డిజిపి, ఏపిపిఎస్సీ ఛైర్మైన్ గౌతమ్ సవాంగ్, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, బీద రవిచంద్ర, అబ్ధుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, కంభం విజయరామిరెడ్డి, శ్రీ కాళహస్తి టిడిపి ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు మేకపాటి గౌతంరెడ్డికి నివాళి అర్పించారు.