Clock Of Nellore ( Nellore ) – గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం ప్రజల సందర్శనార్ధం నెల్లూరులోని వారి నివాసంలో ఉంచారు. రేపు ఉదయం ఉదయగిరికి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళతారు. ఈ అంతిమ యాత్రకు సంభందించిన వివరాలను గౌతమ్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి మీడియాకు తెలియజేశారు.
బుధవారం ఉదయం 6 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డులోని మంత్రి నివాసం నుండి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. నెల్లూరు నుండి జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరు పాళెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దకు అంతిమయాత్ర చేరుతుంది. అనంతరం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడకు చేరుకుని గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆత్మకూరు నియోజకవర్గ ప్రదల సందర్శనార్ధం నెల్లూరు పాళెం సెంటర్ లో అంతిమయాత్రను 5 నిముషాలు నిలిపి ఉంచుతామని గౌతమ్ రెడ్డి వ్యక్తి గత కార్యదర్శి తెలియజేశారు.