
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరానికి చెందిన గుజ్జుల విలియం జోసఫ్ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ ఆయనకు సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్ ను ప్రకటించింది. తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విలియం జోసఫ్ కు… సోషల్ జస్టిస్ పీస్ లీగల్ అండ్ ఎక్స్ పర్ట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ జోసఫ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి డాక్టరేట్ ను ప్రధానం చేశారు. కరోనా కష్టకాలంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ విలియం జోసఫ్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసినట్లు ప్రకటించారు. విలియం జోసఫ్ డాక్టరేట్ అందుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Tags: DoctoraTE Nellore News