Clock Of Nellore ( Nellore ) – నిన్న గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నెల్లూరుజిల్లా ప్రజానీకం ఘన నివాళులు అర్పించింది. ఇవాళ ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి నెల్లూరులోని వారి నివాసానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్ధం ఉంచారు. జిల్లా నలుమూలల నుండి మేకపాటి అభిమానలు నెల్లూరుకు చేరుకుంటున్నారు. ప్రత్యేకించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలంతా నెల్లూరులోని గౌతంరెడ్డి నివాసం వద్దే ఉన్నారు. వీరే కాకుండా పలువురు మంత్రులు కూడా నెల్లూరుకు చేరుకున్నారు. జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎంపి తదితరులు మేకపాటి నివాసానికి చేరుకుని గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.







