రేపు ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు… హాజరు కానున్న సిఎం

Clock Of Nellore ( Nellore ) – నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం నెల్లూరుజిల్లాలోని ఉదయగిరిలో జరగనున్నాయి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరులోని వారి నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. రేపు ఉదయం వరకూ ఆయన భౌతిక కాయం నెల్లూరులోని ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత రోడ్డు మార్గాన గౌతమ్ రెడ్డి అంతిమ యాత్ర నెల్లూరు నుండి ఉదయగిరి వరకూ సాగనుంది. ఉదయం 11 గంటల తర్వాత ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గౌతమ్ రెడ్డి పార్దీవ దేహానికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

మరో వైపు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయన పర్యటన ఇప్పటికే ఖరారైంది. బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయంకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయం 11.30 గంటలకు మెరిట్స్ కళాశాలకు చేరుకుంటారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి నివాళి అర్పిస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉండి తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా కడపకు చేరి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.

Read Previous

గౌతమ్ రెడ్డికి నెల్లూరు ప్రజల నివాళులు… నివాసం వద్ద పోటెత్తిన అభిమానులు

Read Next

ట్రిబ్యూట్ టు గౌతమ్ రెడ్డి… వినూత్నంగా నివాళి అర్పించిన సనత్ కుమార్

Leave a Reply

Your email address will not be published.