గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది : నివాళి అర్పించిన కేతిరెడ్డి

Clock Of Nellore ( Chennai ) – రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గౌతమ్ రెడ్డి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని… గౌతంరెడ్డితో ఉన్న సత్సంబాంధాలను గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు నెల్లూరుజిల్లా ప్రజలకు తీరనిదని, నెల్లూరీయునిగా తనకూ ఆయన లేని లోటు తీర్చలేనిదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తరపున తానూ ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తర్వాత ఒంగోలు పార్లమెంటు, నెల్లూరు ఎంపిగా పోటీ చేసిన సందర్భాల్లో ఆయనకు మద్దతుగా తానూ ఎన్నికల ప్రచారం చేశానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ సందర్భంలో చెన్నైకి రాగా తానే స్వయంగా స్వాగతం పలికానని ఆ సమయంలో సిఎంతో పాటూ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారని… చెన్నైలో తెలుగు వారికి కేతిరెడ్డి అన్నే అండ అన్న మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయన్నారు.

Read Previous

ట్రిబ్యూట్ టు గౌతమ్ రెడ్డి… వినూత్నంగా నివాళి అర్పించిన సనత్ కుమార్

Read Next

విలియం జోసఫ్ కు డాక్టరేట్… ప్రధానం చేసిన హ్యూమన్ పీస్ యూనివర్శిటీ

Leave a Reply

Your email address will not be published.