Clock Of Nellore ( Nellore ) – నైరుతి బంగాళా ఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది ఈ రాత్రికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 410 కిలోమీటర్లు, చైన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అర్ధరాత్రి తర్వాత శ్రీలంక తీరాన్ని తాకి తుఫానుగా మారుతుంది. శుక్రవారం సాయంత్రం వరకూ తుఫానుగా కొనసాగి, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారి, ఈనెల 30కి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు. 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు – పాండిచ్చేరి మధ్య అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుుల దక్షిణ కోస్తాంద్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రధానంగా తిరుపతి, నెల్లూరుజిల్లాల్లో భారీ వర్షంతో పాటూ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.