Clock Of Nellore ( Srihari Kota ) – నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి డిసెంబర్ 4వ తేదీనా ఇస్రో రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. PSLV – C59 రాకెట్ ద్వారా యురోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన PROBA – 03 అనే రెండు స్పేస్ క్యాప్సున్స్ ను గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 4గంటలా 8 నిముషాలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది. PROBA – 03 అనే రెండు స్పేస్ క్యాప్సుల్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ వాతావరణాన్ని పరిశోధిస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Tags: European solar mission that ISRO will launch isro PROBA - 03 PSLV - C59 Satish Dhawan Space Centre SDSC-SHAR