Clock Of Nellore ( Nellore ) – మంత్రి పొంగూరు నారాయణ మీద విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసిన్నట్టే అని టీడీపీ నెల్లూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రేవతి, విజయమ్మ అన్నారు.. మంత్రి నారాయణ మీద విమర్శలు చేసే స్థాయి కోర్టు దొంగ కాకానికి లేదన్నారు.. నెల్లూరు ఎన్టీఆర్ భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. కథలు అల్లడంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సిద్దహస్తులు అని.. అందులో భాగంగానే సాకేష్ పై టీడీపీ నేతలు దాడి చేసారని కట్టు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. బంధువులు మధ్య జరిగిన గొడవ పార్టీలకు అంటకట్టడం దారుణం అన్నారు. వైసీపీ నేతల మీద దాడులు చేయించాల్సిన అవసరం తనకు లేదని.. ఆ సంస్కారం వైసీపీ నేతలకే ఉందంటూ రేవతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయించడం వైసిపి సంస్కృతి అంటూ మండిపడ్డారు.. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో బిజీగా ఉన్న మంత్రి నారాయణ పై కాకాని గోవర్ధన్ రెడ్డి చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ మనస్తత్వం తెలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి… విమర్శలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలంటూ హితవు పలికారు.. కార్యకర్తల సంక్షేమం కోసం, వాళ్ళింట్లో జరిగే శుభ అశుభ కార్యాలకు మంత్రి నారాయణ తన సొంత నిధులను వెచ్చిస్తున్నారని.. అలాంటి గొప్ప మనసు ఎవరికైనా ఉంటుందా అని వారు చెప్పుకొచ్చారు.. మంత్రి పొంగూరు నారాయణ పై అవాకులు చవాకులు పేలితే.. చూస్తూ ఊరుకోమని.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు పాల్గొన్నారు.