నెల్లూరు ఎంపిగా కొప్పుల రాజును గెలిపించండి : ప్రజలకు విశ్రాంత ఐఏఎస్ ల పిలుపు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాకు సుదీర్ఘ కాలం జిల్లా కలెక్టర్ గా సేవలందింది, నెల్లూరు గడ్డపై నుండి రాష్ట్ర స్థాయిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నెల్లూరు ఎంపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొప్పుల రాజును గెలిపించి ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టాలని పూర్వపు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సుజాత రావు కోరారు. మరో విశ్రాంత ఐఏఎస్ పి.వి. రమేష్ తో కలిసి ఆమె నెల్లూరుకు విచ్చేసి కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి కొప్పుల రాజుకు వారి సంఘీభావం తెలియజేశారు. అనంతరం సుజాత రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను 40 ఏళ్ల క్రితం నెల్లూరుకు కలెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో నెల్లూరుకు ప్రత్యేకమైన స్థానం ఉందని అంటూ తన పేరుతో నెల్లూరులో ఏర్పడ్డ సుజాతమ్మ కాలనీ విషయాన్ని విలేకరులతో పంచుకున్నారు. తన తర్వాత కొప్పుల రాజు జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఏ కలెక్టర్ చేయలేనన్ని పనులు చేశారన్నారు. జిల్లా కలెక్టర్ గా కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా జిల్లాలోని ప్రతీ మారుమూల గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేశారని పేర్కొన్నారు. నెల్లూరు గడ్డపై ఉన్న మమకారంతో కొప్పుల రాజు ఇక్కడి నుండే ఎంపిగా పోటీ చేస్తున్నారని ఆయన్ను దీవించి పార్లమెంటుకు పంపాలని సుజాత రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొప్పుల రాజు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన సహకారంతో నెల్లూరు జిల్లా కేంద్రంగా ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యత కార్యక్రమం, పొదుపు లక్ష్మి ఉద్యమం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ఠించాలని పి.వి. రమేష్ వెల్లడించారు. నెల్లూరు కలెక్టర్ గా పనిచేసిన అనంతరం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో తమ సేవలను అందించారని, అక్కడి నుండి ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, పేదలకు ఉచిత బియ్యం లాంటి చట్టాలకు రూపకల్పన చేసింది కొప్పుల రాజునేనని పివి రమేష్ గుర్తు చేశారు. ధనవంతులు, దౌర్జన్యకారులు, అక్రమ సంపాదకులు నేటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఐఏఎస్ గా నిజాయితీగా పనిచేసి, రాజకీయాల ద్వారా పేద ప్రజలకు ఇంకా సేవ చేయాలన్న తపనతో నెల్లూరు ఎంపిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కొప్పుల రాజును గెలిపించాలని పివి రమేష్, సుజాత రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Previous

ఎన్నికల సమయానికి టిడిపి ఖాళీ అవుతుంది : విజయసాయి రెడ్డి వెల్లడి

Read Next

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపి నేత నూనె మల్లిఖార్జున యాదవ్

Leave a Reply

Your email address will not be published.