నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

Clock Of Nellore ( Nellore ) – 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మూడో రోజు శనివారం నెల్లూరు జిల్లావ్యాప్తంగా 9 నామినేషన్లు దాఖలయ్యాయు. కావలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ రెడ్డి, రాచూరు వెంకట సుబ్బారావు ఇండిపెండెంట్, రెవల్షనరీ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా గోసాల రవికాంత్ ఒక్కొక్క సెట్టు నామినేషన్లను, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా గుంజి వెంకటేశ్వర్లు రెండో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శీనా నాయక్ కు అందజేశారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా షేక్ అమీర్ అహ్మద్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కు అందించారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రాకుటూరు పుష్పాంజలి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రేమ్ కుమార్ కు అందజేశారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సేదు మాధవన్ కు అందించారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పొడపాటి శివకుమార్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కిలగుంట ఇషాక్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి విద్యాధరికి అందజేశారు. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే నెల్లూరు పార్లమెంట్ కు కూడా ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తం మీద ఈ మూడు రోజుల్లో 23 మంది అభ్యర్థులు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఇద్దరు అభ్యర్థులు నెల్లూరు పార్లమెంట్ స్థానానికి నామినేషన్ పత్రాలను అందజేశారు. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎవరు నామినేషన్లు దాఖలు చేయలేదు.

Read Previous

మాటిస్తున్నా… చేసి చూపిస్తా : ప్రచారంలో నారాయణ హామీ

Read Next

ప్రతీ ఓటు కీలకమే… జాగ్రత్తగా పనిచేయండి : కార్పొరేటర్లకు విజయసాయి దిశానిర్ధేశం

Leave a Reply

Your email address will not be published.