నమ్మించి ఫోన్‌తో పరార్‌.. కట్‌ చేస్తే.. ‘నీ ఫోన్‌ తీసుకెళ్లినందుకు క్షమించు’

Clock Of Nellore ( SangaReddy ) – ‘నీ ఫోన్‌ తీసుకెళ్లినందుకు క్షమించు.. నీ ఫోన్‌ నీకు ఇస్తున్నా’ అని ఫోన్‌ను ఎత్తుకెళ్లిన వ్యక్తి ‘నమ్మించి.. సెల్‌ ఫోన్‌తో పరారు’ అనే వార్తను చదివి తిరిగి బాధితుడికి ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 27 గురువారం రోజున సంగుపేట గ్రామానికి చెందిన ఆదిత్య అనే యువకుడిని అపరిచిత వ్యక్తి(రమేశ్‌) మాయమాటల్లో దించి మళ్లీ వస్తానని చెప్పి ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. వారిద్దరు కలిసిన సమయంలో ఒకరికొకరు ఫోన్‌ నంబర్లను ఫీడ్‌ చేసుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదిత్య తను ఫీడ్‌ చేసుకున్న ఫోన్‌ నంబరును గూగుల్‌ అకౌంట్‌ కాంటాక్ట్స్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో లభించిన నంబర్‌ ఆధారంగా అతడికి ఫోన్‌ చేశాడు. ‘నాపై ఎందుకు ఫిర్యాదు చేశావ్‌.. పేపర్లో ఎందుకు వేయించావు.. నీ ఫోన్‌ తీసుకెళ్లినందుకు క్షమించు నీ ఫోన్‌ నీకు ఇస్తున్నా’ అని రమేశ్‌ ఫోన్‌ పెట్టేశాడు. అదే సాయంత్రం ఎత్తుకెళ్లిన ఫోన్‌ ను ఫసల్‌వాదీలోని ఒక దుకాణంలో ఇచ్చి వెళ్లిపోయాడు. దుకాణదారుడు అదే రాత్రి ఆదిత్యకు ఫోన్‌ అప్పగించాడు. దీంతో బాధితుడు తన ఫోన్‌ లభించడంతో కేసు వాపసు తీసుకున్నాడు.

Read Previous

చలికి గడ్డకట్టి… అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం

Read Next

కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి

One Comment

  • It’s actually a great and helpful piece of info. I am happy that you shared this helpful information with us. Please stay us informed like this. Thank you for sharing.

Leave a Reply

Your email address will not be published.