మాటిస్తున్నా… చేసి చూపిస్తా : ప్రచారంలో నారాయణ హామీ

Clock Of Nellore ( Nellore ) – 2014లో చెప్ప‌కుండా…మీరు న‌న్ను ఏమి అడ‌గ‌కుండానే నెల్లూరు న‌గ‌రానికి ఎన్నో అభివృద్ధి ప‌నులు చేశాన‌ని…ఈ సారి 2024లో నేనే చెబుతున్నాన‌ని…పెండింగ్‌లో ప్రాజెక్టుల‌న్నీ కంప్లీట్ చేస్తాన‌ని…మీకు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటాన‌ని… మాజీ మంత్రి, నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కి హామీ ఇచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా… 48డివిజ‌న్ మీరా మోద్దిన్ దర్గా నుండి కుక్కలకుంట మహాలక్ష్మమ్మ గుడి త‌దిత‌ర ప్రాంతాల్లో…స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవితో క‌లిసి ఆయ‌న మినీ ర్యాలీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ముందుగా డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు ఆయ‌న‌కి అడుగడుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌చార ర‌థంపై ప్ర‌జ‌ల‌కి అభివాదం చేస్తూ ప్ర‌చారం చేశారు. నారాయ‌ణ స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవి మ‌హిళా మ‌హిళా శ‌క్తి టీం, మ‌హిళా నాయ‌కురాళ్ల‌తో క‌లిసి ప్ర‌చార ర‌థానికి ముందు వెళుతూ…మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుపై ఓటేసి…న‌న్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో…డివిజ‌న్‌లోని ఓ టిఫిన్ దుకాణం వ‌ద్ద ఆగిన ర‌మాదేవి… దోసెలు పోసి…వ‌డ‌లు వేసింది. వాటిని ఆమె నారాయ‌ణ‌కి ఇచ్చారు. వాటిని తింటూ…ప్ర‌జ‌ల‌తో కాసేపు స‌ర‌దాగా గ‌డిపారు.

డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ…ఏ డివిజ‌న్‌కెళ్లినా…ప్ర‌జ‌లు చిరున‌వ్వుతో స్వాగ‌తం చెబుతున్నార‌న్నారు. దానికి కార‌ణం టీడీపీ ప్ర‌భుత్వంలో చేసిన పనులేన‌న్నారు. ఈ రోడ్లు వేసింది మీరు…ఈ పార్కులు చేసింది మీరేన‌ని ప్ర‌జ‌లే నాకు చెబుతుండ‌డం నాకు సంతోషంగా ఉంద‌న్నారు. చేసిన ప‌నుల‌ని ప్ర‌జ‌లు మ‌నసులో పెట్టుకుంటారు.. ఆద‌రిస్తార‌నే దానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఒక‌ప్పుడు నేను వ‌చ్చిన‌ప్పుడు ఈ డివిజ‌న్‌లోని పార్కులో పందులు దొర్లుతూ ఉండేవ‌ని…టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌.. నెల్లూరు సిటీలోని అన్నీ పార్కుల‌ను ఎంతో అద్భుతంగా డెవ‌ల‌ప్ చేశామ‌ని గుర్తు చేశారు. యువ‌త కోసం ఓపెన్ జిమ్‌, వాకింగ్ ట్రాక్, పిల్ల‌ల కోసం ఆట వ‌స్తువులు ఇలా ఎన్నో ప‌రిక‌రాల‌ను అందుబాటులో ఉంచామ‌న్నారు. ఈ ప్ర‌భుత్వం పార్కుల్లో మెయింటెన్స్ లేద‌ని…గ్రాస్ అంతా పోయింద‌ని…పార్క్ అంటేనే గ్రాస్ ఎప్పుడూ ఉండాల‌న్నారు. ఇవ‌న్నీ ఉంటేనే…పార్కు అందంగా ఉంటుంద‌న్నారు. వీట‌న్నింటిని ప్ర‌జాప్ర‌తినిధులు అధికారుల చేత చేయించాల‌న్నారు. ఎక్క‌డ ఏ బిల్డింగ్ ప‌గుల‌గొడుతామా…ఎవ‌రి లైసెన్స్ ర‌ద్దు చేద్దామా…ఇవి త‌ప్పితే ప్ర‌జా అవ‌స‌రాల‌ను ఈ ప్ర‌భుత్వం కానీ…ఈ అధికారులు కానీ చూడ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. 2014 నుంచి మేము ప్ర‌జల అవ‌స‌రాల‌ను తీర్చాము కాబ‌ట్టే…మ‌మ్మ‌ల్ని ఇప్పుడు ఆద‌రిస్తున్నార‌న్నారు. అజీజ్ మేయ‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో బారాష‌హీద్ ద‌ర్గాని అద్భుతంగా అభివృద్ధి చేశామ‌ని… అలాగే కోట‌మిట్ట షాదీమంజిల్ ని నిరుపేద‌ల కోసం అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌న్నారు. అదే విధంగా ముస్లిం మ‌హిళ‌ల కోసం గోషా హాస్పిట‌ల్‌ని నిర్మించామ‌న్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌న్నీ కంప్లీట్ చేయ‌డంతోపాటు…పార్కుల‌న్నింటిని పూర్తి చేస్తామ‌న్నారు. అదే విధంగా నిరుపేద‌లంద‌రికి నేనే పిలిచి మ‌రీ ఇల్లు ఇస్తాన‌ని…అవ‌స‌ర‌మైతే మ‌రో 43వేల ఇల్లు క‌ట్టించి ఇస్తాన‌ని ప్ర‌జ‌ల‌కి హామీ ఇచ్చారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పూర్తి చేసి…దోమ‌లు లేని నెల్లూరుసిటీగా చేసి చూపిస్తాన‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో నేను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నామ‌ని…మే 13న ప్ర‌జ‌లంద‌రూ సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి…మా ఇద్ద‌రిని అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

అనంత‌రం నారాయ‌ణ స‌తీమ‌ణి ర‌మాదేవి మాట్లాడుతూ…ఏ డివిజ‌న్‌కెళ్లినా…ప్ర‌జ‌లంద‌రూ ఎంతో సంతోషంగా త‌మ‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని…నిజంగా వారి ఆద‌ర‌ణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. గ‌త 2016లో టీడీపీ ప్ర‌భుత్వ ఉన్న‌ప్పుడు భారీ వ‌ర్షాలు వ‌చ్చి ఖుద్దూస్ న‌గ‌ర్‌, మ‌న్సూర్ న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల‌న్నీ నీట మునిగిపోయి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని…ఆ స‌మ‌యంలో మంత్రిగా ఉన్న నారాయ‌ణ అక్క‌డే ఉండి…మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుని ఈ ప్రాంతానికి తీసుకువ‌చ్చి 14 రోజులు నిరుపేద‌ల‌తో గ‌డిపి…ఆ వ‌ర్ష‌పు నీరంతా పోయేలా చేశార‌ని ప్ర‌జ‌లే మాకు చెబుతుండ‌డం నిజంగా ఆనందంగా ఉంద‌న్నారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు నారాయ‌ణ సార్ ఎంతో అభివృద్ధి చేశార‌ని…ఆ త‌రువాత ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని కోరార‌ని…ఇంత క‌న్నా అభివృద్ధి చేస్తారేమోన‌ని ఒక్క అవ‌కాశం ఇచ్చామ‌ని…కానీ ఆ త‌రువాత తెలిసింది అమ్మా…మేము ఒక్క ఛాన్స్ ఇచ్చి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశార‌న్నారు. మ‌ళ్లీ నారాయ‌ణ సార్ వ‌స్తేనే…పెండింగ్‌లో ఉన్న వ‌ర్క్ ల‌న్నీ కంప్లీట్ అవుతాయ‌న్న న‌మ్మ‌కం మాకుంద‌ని…ఈ సారి ఖ‌చ్చితంగా సైకిల్ గుర్తుకే ఓటేసి… ఎమ్మెల్యేగా నారాయ‌ణ సార్ గెలిపించుకొని తీరుతామ‌ని ప్ర‌జ‌లే నాకు హామీ ఇస్తుండ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఆలోచించి…మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి… ఎమ్మెల్యేగా నారాయ‌ణ‌ను, ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌ను అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని ర‌మాదేవి కోరారు.

Read Previous

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ఆదాల సన్నిహితుడు GVN

Read Next

నెల్లూరు జిల్లాలో 3వ రోజు 9 నామినేషన్లు : సర్వేపల్లిలో ఇప్పటి వరకూ నిల్

Leave a Reply

Your email address will not be published.