కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : 5 మంది దుర్మరణం

Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జలదంకి మండలం, చామదల గ్రామానికి చెందిన 5 మంది కారులో నెల్లూరు నుండి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. చామదల గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసులు, దావులూరు వరలక్ష్మి, గంటా రమణమ్మ, లక్ష్మమ్మ, నీలిమ అనే 5 మంది మంగళవారం విజయవాడకు కారులో బయలుదేరారు. శ్రీనివాసులు కారును డ్రైవ్ చేస్తున్నారు. కావలి సమీపంలో ముంగమూరు వద్ద జాతీయ రహదారిపై కారు వేగంగా వెళ్తుండగా, ముందు ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులోని 5 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలంకు చేరుకుని కారులోని మృతదేహాలను బయటకు తీసి కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు ఆగి ఉన్న లారీని గమనించకపోవడం, ఆగి ఉన్న లారీ ప్రయాణంలో ఉందని భావించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

ఇండియాలోనే నెల్లూరును నెంబర్ వన్ సిటీగా చేస్తా : ప్రచారంలో నారాయణ వెల్లడి

Read Next

ఏసి మార్కెట్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం : మార్కెట్ లో వైసీపి అభ్యర్ధుల ప్రచారం

Leave a Reply

Your email address will not be published.