ఏసి మార్కెట్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తాం : మార్కెట్ లో వైసీపి అభ్యర్ధుల ప్రచారం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఏసి కూరగాయల మార్కెట్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని వైసీపి నెల్లూరు ఎంపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి, సిటీ, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఖలీల్ అహ్మద్, ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మార్కెట్ వద్దకు చేరుకున్న అభ్యర్ధులకు వ్యాపారస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ లు ప్రతీ స్టాల్ వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్ధించారు. వైసీపి ప్రభుత్వం రాగానే ఏసి మార్కెట్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Read Previous

కావలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం : 5 మంది దుర్మరణం

Read Next

మార్కెట్ లో కూరగాయలు అమ్మిన విజయసాయిరెడ్డి : కొనుగోలు చేసిన ఆదాల, ఖలీల్

Leave a Reply

Your email address will not be published.