Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉండవచ్చు కానీ…పేద ప్రజల మీద కాదని…వైసీపీ నాయకులకి… మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా… ఆయన 4,5వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా నారాయణకి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ఇంటింటికెళ్లి 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకి వివరించారు. సార్…దోమలు ఎక్కువగా ఉన్నాయ్… మీ హయాంలో మాకు ఇల్లు వచ్చింది…దానిని ఇప్పటి వరకు ఇవ్వలేదు…డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి సార్…అంటూ ఇలా స్థానిక ప్రజలు పలు సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. మీ సమస్యలన్నింటిని నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి… ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏ డివిజన్‌కెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న సమస్యలను నా దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. అందరూ డ్రింకింగ్ వాటర్ కావాలని అడుగుతున్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు నిరుపేదల కోసం టిడ్కో గృహాలు నిర్మించామని…వాటిని పూర్తి చేసి లాటరీ తీశామన్నారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని ఇవ్వకపోవడం దారుణమన్నారు. భారతదేశంలోనే ఎక్కడా కట్టని విధంగా హై టెక్నాలజీతో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మించామన్నారు. అదే విధంగా ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంతో… రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షలు ఇళ్లు, ఒక్క నెల్లూరు నగరంలోనే రూ. 2,265 కోట్లతో 43 వేల గృహాలను నిర్మించామని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా కట్టిన ఇళ్లను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అలాగే నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా చేయాలని రూ. 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకువచ్చామన్నారు. దాదాపు 90 శాతం పూర్తయిందన్నారు. ఈ ప్రభుత్వం మిగిలిన పది శాతం పూర్తి చేసి దోమలు లేని నగరంగా ఉండేదన్నారు. నగర ప్రజలందరికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని రూ. 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి డ్రింకింగ్ ప్రాజెక్టు తీసుకువచ్చామని…అది కూడా దాదాపు 80 శాతం పూర్తయిపోయిందని…కేవలం ఇంట్లోకి కనెక్షన్ ఇవ్వాలన్నారు. దానిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు. మా తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉండవచ్చు కానీ… ప్రజల మీద ఉండకూడదన్నారు. ఏ నాయకులు వచ్చినా… గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులను వచ్చిన ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలని హితవు పలికారు. అలాంటి ఆలోచన జగన్మోహన్‌రెడ్డి అస్సలు లేదని ఎద్దేవా చేశారు. పేదవాడి కడుపునిండా అన్నం తినాలన్న మంచి ఆలోచనతో అన్న క్యాంటీన్లను తీసుకువచ్చామని… ఒక్క నెల్లూరులోనే ఏడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. జగన్ ప్రభుత్వం వాటిని మూసేసి పేదవాడి కడుపుకొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బందులకి గురి చేస్తామా…ఎవరి మీద అక్రమ కేసులు పెడుదామా…ఎవరైనా మాట్లాడితే వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తామా…ఇలాంటి ఆలోచనలు తప్ప..మరో ఆలోచన లేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో బారా షహీద్ దర్గాని ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. మేము ఫేజ్ 1 చేశామని…ఇంకా ఫేజ్2, ఫేజ్ 3 చేయాల్సి ఉందని…దానిని కూడా వదిలేశారన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రజా సమస్యలపై కంటే…పార్టీ సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారన్నారు. వైసీపీ నాయకులు దెబ్బకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పడిపోయిందన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆదాయం రాదో…డెవలప్ మెంట్, సంక్షేమం రెండూ ఆగిపోతాయన్నారు. అది చేయలేక ప్రజల మీద భారం మోపి…ట్యాక్స్ లు వేశారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలపై చెత్త పన్నులు వేశారని…కరెంటు చార్జీలు పెంచేశారన్నారు. టీడీపీ హయాంలో ఒక్క సారిగా కూడా మున్సిపల్ ట్యాక్స్ లు పెంచలేదని గుర్తు చేశారు. ప్రతీ సంవత్సరం మున్సిపాలిటీలు పెరుగుతుంటాయని…బిల్డింగ్‌లు పెరుగుతుంటాయని…కొత్తగా లేఅవుట్లు వస్తుంటాయని…వాటి వల్ల… ప్రభుత్వానికి ఆటోమెటిక్ గా ఇన్‌కమ్ వస్తూ ఉంటుందన్నారు. ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి…నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని నారాయణ ప్రజల్ని కోరారు. మేమిద్దరం అధికారంలో ఉంటే…కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి… భారతదేశంలోనే నెల్లూరుని నెం. 1 మోడల్ సిటీగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
