ఒక్క అవకాశం ఇచ్చి చూడండి : గొల్లకందుకూరు ప్రచారంలో ఆదాల విజ్ఞప్తి

Clock Of Nellore ( Nellore Rural ) – అల్లూరు, సర్వేపల్లి ఎమ్మెల్యేగా, నెల్లూరు ఎంపిగా పనిచేసిన అనుభవం ఉంది… రూరల్ నియోజకవర్గం నుండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఎంటో చేసి చూపిస్తానంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు… నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి బృహత్ ప్రణాళికను సిద్దం చేశానని, 15 వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. శనివారం ఆయన గొల్లకందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతి, డిసిసిబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి ఆ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అల్లర్లు, అరాచకాలకు దూరంగా అభివృద్దే పరమావదిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. 1500 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే తానేంటో నిరూపించుకుని, మరో సారి మీరే ఎమ్మెల్యేగా ఉండాలని మీతోనే అనిపించుకుంటానని ఆదాల స్పష్టం చేశారు. సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే వచ్చే నెల 13వ తేదీనా పోలింగ్ జరగనుందని, ప్రజలంతా ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని అభ్యర్ధించారు.

Read Previous

స్వంత జిల్లాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి : ప్రచారంలో విజయసాయిరెడ్డి సతీమణి

Read Next

జూలైలో 7వేలు పెన్షన్ ఇస్తాం : ప్రచారంలో కోటంరెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.