
Clock Of Nellore ( Nellore ) – ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటా ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి సునంద విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ, 40 వ డివిజన్ లో పార్టీ డివిజన్ ఇంఛార్జ్ మానికల సునీల్ ఆద్వర్యంలో నిర్వహించిన ఇంటికి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిసస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మరింత సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ కి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని, సిటీ ఎమ్మెల్యే గా ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దాదాపు ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి అఖండ విజయాన్ని సాధించి పెడతాయని అన్నారు. విజయసాయిరెడ్డి నెల్లూరు బిడ్డ అని , ఇక్కడే పుట్టి పెరిగారని, స్వంత జిల్లాకు సేవ చేసుకునే అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నెల్లూరు అభివృద్ధి కి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని అన్నారు. కార్యక్రమంలో జంగమ కార్పొరేషన్ చైర్ పర్సన్ వావిలేటి లక్ష్మీ ప్రసన్న, జిల్లా పార్టీ మహిళా విభాగం అద్యక్షురాలు మొయిళ్ల గౌరీ, పొర్టీ మహిళా నేతలు కర్తం జ్యోతి, హిమబిందు, బెందాళం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.