నెల్లూరు సిటీ వైసీపి సమన్వయకర్తలుగా ఆనం విజయ, చంద్రశేఖర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపి అభ్యర్ధి ఖలీల్ అహ్మద్ గెలుపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్ఠి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపి అభ్యర్ధిగా పంపగా ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ ను అభ్యర్ధిగా ప్రకటించారు. అనీల్ నరసారావుపేట వెళ్లిన నేపద్యంలో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురికాకుండా ముఖ్యమంత్రి జగన్… సిటి నియోజకవర్గానికి పలువుర్ని సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సమన్వయకర్తలను వైసీపి ప్రకటించనుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమిస్తారని సమాచారం. సోమవారం ఆనం విజయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఇద్దరూ ముఖ్యమంత్రిని కలిశారు. నగర నియోజకవర్గంలో సమన్వయకర్తలుగా వ్యవహరించి పార్టీలోని క్యాడర్ ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఖలీల్ ను గెలిపించాలని ముఖ్యమంత్రి వారికి సూచించినట్లు తెలిసింది. వారితో పాటూ మరికొంత మందిని కూడా సమన్వయకర్తలుగా నియమిస్తారని కూడా తెలుస్తోంది.

Read Previous

ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం : మీకే మా మద్దతు అన్న ప్రజలు

Read Next

జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం : బడ్జెట్ కు ఆమోదం

Leave a Reply

Your email address will not be published.