Clock Of Nellore ( Nellore ) – 2024- 25 సంవత్సరాలకు సంబంధించి 374కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ అంచనాల బడ్జెట్ ఆమోదించినట్టు నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ చెప్పారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2024 – 2025 సంవత్సరాలకు బడ్జెట్ సంబంధించి జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ప్రవేశపెట్టిన అంచనాల బడ్జెట్ ను సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ 2023 -24 సంవత్సర సవరణ బడ్జెట్ మరియు 2024- 25 సంవత్సరపు అంచనాల బడ్జెట్ ను ఈ సమావేశంలో సభ్యులు ఆమోదించారని చెప్పారు. 2022-2023 సంవత్సరం నికరములు 157కోట్ల 89లక్షల5వేల479 రూపాయలుకాగా దానిలో 161కోట్ల 5లక్షల2వేల109 రూపాయలుగా ఉన్నాయని, 2023-2024 సంవత్సరం బడ్జెట్ అంచనాలు 366కోట్ల 89లక్షల65 వేల440 రూపాయలు కాగా వ్యయం 326 కోట్ల 36లక్షల91వేల300 రూపాయలుగా ఉందన్నారు. 2023-2024 సవరణ అంచనాలు 348కోట్ల 20లక్షల 48వేల30 రూపాయలు కాగా వ్యయం 281కోట్ల 25లక్షల70వేల200రూపాయలు ఉన్నాయని, 2024-2025 బడ్జెట్ అంచనాలు 374కోట్ల43లక్షల 4వేల480రూపాయలు కాగా వ్యయం297 కోట్ల రూపాయల 41లక్షల48వేల290రూపాయలతో ఆమోదించారని వెల్లడించారు.
జిల్లా పరిషత్ ఆమోదించిన బడ్జెట్ ను జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మరియు జిల్లా మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లి నిధులు సాధించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో సాగునీటి అవసరాల కోసం సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణం పూర్తి చేయడానికి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జిల్లాలో వెనుకబడి ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే ఉదయగిరి ప్రాంతంలో 1కోటి 20లక్ష రూపాయలతో ఎనిమిది త్రాగునీటి ఆర్వో ప్లాంట్లను మంజూరు చేశామని ఆనం అరుణమ్మ వెల్లడించారు. జిల్లాలో వికలాంగులకు అవసరమైన మూడు చక్రాల వాహనాలు జిల్లా పరిషత్ నుండి మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి బిల్లులు చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో చిరంజీవి, జడ్పిటిసిలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
