Clock Of Nellore ( Nellore ) – టిడిపి నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న ఒక్కడే … ఒంటరిగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని వందన ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో భాగంగా సమావేశానికి హాజరైన ప్రతీ ఒక్కరిని ఎమ్మెల్యే కోటంరెడ్డి పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో రూరల్ నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనను మీరంతా ఆశీర్వదించాలని కోరగా… సమావేశానికి హాజరైన ప్రజలంతా ముక్త కంఠంతో మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. మీలాగా ఎవ్వరూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ… సమస్యలపై స్పందించరని, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తనది ప్రజాపక్షమని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తన జీవితం అంకితమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని అభ్యర్ధించారు.
