టిడిపి నేతలపై కేసు నమోదు : A1 ముద్దాయిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ బుధవారం సాయంత్రం నెల్లూరులో శాంతియుత ర్యాలీ నిర్వహించిన టిడిపి నేతలపై నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారితో పాటూ జనసేన, సిపిఐ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మొత్తం 16 మందిపై 143, 341, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ ను సిద్దం చేశారు. ఈ కేసులో A1 ముద్దాయిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాగా, A2 గా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. A3 గా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, A4 గా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, A5గా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, A6గా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, A7గా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, A8గా సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం, A9గా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, A10గా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, A11 గా తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, A12గా కావలి టిడిపి ఇంఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, A13 గా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, A 14గా కోవూరు టిడిపి ఇంఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, A15గా టిడిపి నేత గుమ్మడి రాజా యాదవ్, A16 గా టిడిపి నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.

Read Previous

నారాయణను నమ్ముకుంటే నట్టేటా ముంచేస్తారు : మాజీ మంత్రి అనీల్ ధ్వజం

Read Next

ఘనంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర : ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

Leave a Reply

Your email address will not be published.