
Clock Of Nellore ( Venkatagiri ) – తిరుపతి జిల్లా, వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అత్యంత ఘనంగా జరిగింది. గురువారం ఉదయం నుండి ప్రత్యేకంగా తయారైన అమ్మవారి విగ్రహాన్ని ఆలయం వద్ద భక్తుల సందర్శనార్ధం ఉంచారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపి ఇంఛార్జ్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి సమక్షంలో నిర్వహిస్తున్న ఈ జాతరలో ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, మేరుగ మురళి పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. రాంకుమార్ రెడ్డి కుటుంబం కూడా అమ్మవారిని దర్శించుకుంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు జరిగింది. వెంకటగిరి పట్టణ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఊరేగింపు అనంతరం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.