ప్రజా కోర్టులో సిఎం జగన్ కు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపాటు

Clock Of Nellore ( Nellore ) – తన ముందుచూపుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచం చూసేలా అభివృద్ధి చేసి, నవ్యాంధ్ర నిర్మాణానికి నడుంబిగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. 2024లో జరిగే ఎన్నికల్లో అధికార వైసీపిని ఇంటికి పంపి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కోటంరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నెల్లూరులోని తన కార్యాలయంలో గత 13 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి… చేనేత కుటుంబాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. చేనేతలతో కసిసి రాట్నం తిప్పుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా జైల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏ రోజూ వీధుల్లోకి రాని ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిలు వీధుల్లోకి వచ్చి ఈ దుర్మార్గ వైసిపి ప్రభుత్వంపై తెగించి పోరాటం చేస్తున్నారని వారికి రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా కోర్టులో ఆయనకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపిలోకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి : సిఎం సమక్షంలో త్వరలో చేరిక

Read Next

రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది : జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.