రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది : జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని 46 మండలాల అభివృద్ధే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు అభినందన సభను ఏర్పాటు చేశారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి అరుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యోగులతో కలిసి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ రెండేళ్ల పాలన పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని, అధికారులు, ఉద్యోగుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఛైర్మైన్ గా ఎన్నికయ్యానని, సిఎం ఆశయ సాధన కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జడ్పీటిసి, ఎంపిటిసి సభ్యులు, అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు అరుణమ్మ తెలిపారు. జిల్లాలో రోడ్లు, డైన్లు, మంచినీటి పంపులు, మంచినీటి పథకాల మరమ్మత్తులకు జిల్లా పరిషత్ ద్వారా 19.80 కోట్లు మంజూరు చేశామని, అంగన్ వాడీ కేంద్రాలలో అదనపు గదుల నిర్మాణానికి 8.34 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అభివృద్దే ఎజెండాగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

Read Previous

ప్రజా కోర్టులో సిఎం జగన్ కు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపాటు

Read Next

తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి : విజయబాబు సూచన

Leave a Reply

Your email address will not be published.