
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాళెంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ చక్రధారుడైన లక్ష్మీ సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి ముందుగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు వివిధ అభిషేకాలను నిర్వహించారు. పూజల అనంతరం శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి వారిని గరుడ వాహనంపై ఉంచి అలంకరించారు. తర్వాత నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామి వాహనాన్ని భుజాలపై మోసి తరించారు. చింతారెడ్డిపాళెంలోని అన్నీ వీధుల్లో ఈ నగరోత్సవం సాగింది. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి ఉత్సవంలో పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించి దర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్క్రృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, మేళతాళాలతో కిక్కిరిసిన భక్తుల నడుమ ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కమిటి సభ్యులు తొగురు మహేంద్ర, వల్లం అశోక్, తొగురు బాలాజీ, శ్రీకుమార్, పనికి శీనయ్య, పనికి వినోద్, తిరుపతయ్య ఆధ్వర్యంలో ఈ గరుడ మహోత్సవం సాగింది.