ఈనెల 19న ప్రపంచ కాలేయ దినోత్సవం : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం. కాలేయం (Liver) మానవ శరీరానికి అత్యంత ముఖ్యమైన మరియు సంక్లిష్టమైన అవయవాలలో ఒకటి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తి (Immunity power),జీర్ణక్రియ వంటి వాటికి దోహదం చేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు ముఖ్యమైనవే. కానీ వాటిలో కాలేయం కొంచెం భిన్నం. ఎందుకంటే.. ఏ సమస్య వచ్చినా.. శరీరం ముందే సంకేతాలు ఇస్తుంది. కానీ కాలేయం విషయంలో అలా కాదు. పూర్తిగా భిన్నం. కాలేయం పూర్తిగా నాశనం అయ్యే వరకు ఎలాంటి సంకేతాలను ఇవ్వదు. కాబట్టి ఎటువంటి సమస్యలు లేవని కాలేయాన్ని శ్రద్ధ చూపకపోవడం కచ్చితంగా ముప్పే అంటున్నారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్. జి వరప్రసాద రావు అంటున్నారు. అటువంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి, ఏటా ఏప్రిల్ 19 ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం కాలేయ సంబంధిత వ్యాధులు భారతదేశంలో మరణాలకు అత్యంత సాధారణ కారణం. వ్యాధులు వెంటనే లక్షణాలను చూపించనప్పటికీ, ఉక్కిరిబిక్కిరి అవుతున్న వ్యాధి సంకేతాలను గమనించడం అసాధ్యం కాదు. మీరు కాలేయ సంబంధిత వ్యాధి బారిన పడుతూ ఉంటే మీ శరీరం దానిని సూచించవచ్చు – కాళ్లు, చీలమండలలో వాపు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, కామెర్లు, కడుపు నొప్పి, మూత్రం రంగులో మార్పు, పొట్ట చుట్టూ దురద, ఎరుపు చర్మం, మలంలో రక్తం మొదలైనవి. ఈ లక్షణాలను విస్మరించకూడదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ప్రబలంగా ఉన్నట్లయితే తక్షణ వైద్య సహాయం అవసరం. ఒక వ్యాధి అభివృద్ధి అయిన తర్వాత కష్టంగా మారే బదులు, కాలేయ ఆరోగ్యాన్ని ముందుగానే గ్రహిస్తే తద్వారా కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మద్యం మానుకోండి. ఆల్కహాల్ మీ శరీరాన్ని విపరీతంగా డీహైడ్రేట్ చేస్తుంది. మీ కాలేయం శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని కష్టతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో ఆకు కూరలు , పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఒత్తిడి తగ్గించుకోండి. ఇండియాలో లివర్ పనితీరు దెబ్బతినడానికి ప్రధాన కామన్ కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోవడం వల్ల రాను రాను సిర్రోసిస్ సమస్యకు గురవుతారు. అలాగే హెపటైటిస్ బీ మరియు సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ లివర్ ప్రాబ్లెమ్ కు కారణం. 10 నుంచి 15 సంవత్సరాలకు పైగా ఈ ఇన్ఫెక్షన్స్ తో సతమతమయ్యేవారిలో సిర్రోసిస్ సమస్య కనిపించవచ్చు అని డాక్టర్ వర ప్రసాద రావు అన్నారు.

Read Previous

నెల్లూరు నర్తకి సెంటర్ లో వ్యక్తి అనుమానస్పద మృతి

Read Next

చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోవాలి : కార్యకర్తలతో కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.